ఏయూ వీసీగా ఆచార్య ప్రసాదరెడ్డి

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగం సీనియర్‌ ఆచార్యులు ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జె.ఎస్‌.వి ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాదరెడ్డి ఆచార్యునిగా, కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిపుణుడిగా సుపరిచితులు. ఏయూ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా 1987లో పదవీ బాధ్యతలను చేపట్టి సీనియర్‌ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. 2008-2011 […]

Continue Reading

ద్రోణంరాజు శ్రీనివాస్‌కు కీలక పదవి

ఏపి సియం వైఎస్‌ జగన్‌ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ను విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా నియమించారు. విశాఖకు చెందిన శ్రీనివాస్‌ తొలుత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ తరఫున విశాఖ సౌత్‌ నుంచి పోటీ చేసి ద్రోణంరాజు టిడిపి అభ్యర్థి గణేశ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయారు.

Continue Reading