గరుడ వాహనంపై విహరించిన వేంకటేశుడు

గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు భారీగా భక్తులు తరలివస్తారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం గరుడ వాహనంపై శ్రీవారు తిరువీధుల్లో విహరించారు. అశేష భక్త జనసందోహం నడుమ ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. మలయప్ప స్వామివారికి గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు.

Continue Reading

సినీనటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూశారు

సినీనటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూశారు. వెన్నునొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అపోలో వైద్యులు ఆయన మధ్యాహ్నం 2.10 గంటలకు చనిపోయినట్లు ప్రకటన విడుదల చేశారు. శివప్రసాద్ డాక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి.. సినీరంగంలోకి అడుగు పెట్టారు.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా ఉంది. శివప్రసాద్ చిత్తూరు జిల్లా పూటిపల్లిలో 1951 జూలై 11న జన్మించారు. ఆయనకు భార్య, […]

Continue Reading

టిటిడి నూత‌న ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం

టిటిడి నూత‌న ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం       నూత‌నంగా ఏర్పడిన టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిలో ముగ్గురు సభ్యులు తిరుమల శ్రీ‌వారి ఆలయంలో శనివారం ఉద‌యం ప్రమాణ స్వీకారం చేశారు.        ఇందులో భాగంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ‌ (తుడా)ఛైర్మ‌న్ మ‌రియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీవారి ఆలయంలో టిటిడి ట్రస్ట్ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.        తరువాత […]

Continue Reading

తిరుమల శ్రీవారి హుండీని విద్యార్థులతో లెక్కించాలన్న టీటీడీ ప్రయోగం విజయవంతమైంది

తిరుమల శ్రీవారి హుండీని విద్యార్థులతో లెక్కించాలన్న టీటీడీ ప్రయోగం విజయవంతమైంది. సాధారణంగా కానుకల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది… అయితే విద్యార్ధులతో లెక్కింపు ప్రక్రియ మాత్రం నిన్న మధ్యాహ్నం 2.30కే పూర్తయ్యింది. దీంతో ఇక నుంచి విద్యార్ధుల చేతే కానుకలు లెక్కించే యోచనలో ఉంది టీటీడీ. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు లెక్కించే ప్రక్రియ టీటీడీ అధికారులను ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ముందు నుంచి కూడా హుండీ లెక్కింపు ప్రక్రియ టీటీడీ […]

Continue Reading

తిరుమలలో గెలిచేది ధర్మారెడ్డా…ప్రైవేట్‌ పిఆర్‌వోలా.

తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల రూపంలో తిష్టవేసిన దళారులను కొండ దించడం కోసం స్పెషల్‌ ఆఫీసర్‌ ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 13 మంది పిఆర్‌ఓలను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్‌ అధికారులు…వారి బాగోతాలను బయటకు తీస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పట్టుబడిన వారిలో ఎందరిని పోలీసులకు అప్పగిస్తారు, ఒత్తిళ్ల వల్ల ఎందరిని వదిలేస్తారు అనేది వేరే సంగతిగానీ….తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల వ్యవహారం గురించి తెలిస్తే విస్తపోవాల్సిదే. దళారులకు రాజపోషకులు అధికారులే…తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల వ్యవస్థ వేళ్లూనుకుంది. దీన్ని తొలగించడం అంత తేలికైన పనిగా […]

Continue Reading

పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు

తిరుమలలో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు  హెల్త్ డిపార్ట్‌మెంట్‌ అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని స్పష్టం చేశారు. చైర్మన్ కార్యాలయంలో ఆరోగ్య విభాగం అధికారి రాంనారాయణ్‌ రెడ్డితో వైవీ సుబ్బారెడ్డి పారిశుద్ధ్యంపై శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు  ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..  తిరుమలలో పారిశుద్ధ్య లోపంపై అనేక ఫిర్యాదులు అందాయని, వెంటనే చర్యలు చేపట్టి బాధ్యులైన అధికారులపై  చర్యలు తీసుకుంటామని అన్నారు  నడకదారిలో వచ్చే భక్తుల అవసరాలకు […]

Continue Reading

తిరుమల శ్రీవారి దర్శనానికి భారత ప్రథమ పౌరుడు

  రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ పర్యటన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు చేపట్టింది. నలుగురు ఎస్పీ స్థాయి అధికారులు, ఆరుగురు ఏఎస్సీలు, 22 మంది డీఎస్పీలు, 35 సీఐలు, 75 మంది ఎస్‌ఐలు, 300 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 400 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 200 మంది స్పెషల్‌ పోలీసులు, 3 కంపెనీల ఏపీఎస్‌పీ సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన మరో 475 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రపతి భద్రత నిమిత్తం […]

Continue Reading

గౌరవ భారత రాష్ట్రపతి చిత్తూరు జిల్లా పర్యటన వివరాలు.

గౌరవ భారత రాష్ట్రపతి చిత్తూరు జిల్లా పర్యటన వివరాలు. 13.07.2019 శనివారం ?సాయంత్రం 5.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయం (చెన్నై నుండి) చేరుకుంటారు. ?5.45 గంటలకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించు కుంటారు. ?6.15 గంటలకు శ్రీకపీలేశ్వర స్వామిని దర్శించు కుంటారు. ?రాత్రి 7.05 గంటలకు తిరుమల శ్రీపద్మావతి అతిధి గృహం చేరుకుని బస చేస్తారు. 14.07.2019 ఆదివారం ?ఉదయం 5.40 గంటలకు వరహస్వామిని దర్శించు కుంటారు. ?6.00 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించు కుంటారు. ?మధ్యాహ్నం […]

Continue Reading

13న తిరుమలకు రాష్ట్రపతి రాక

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల పర్యటన ఖరారైంది. శ్రీవారి దర్శనార్థం రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 13న తిరుమలకు రానున్నారు. ఆ రోజు తిరుమలలో బస చేసి.. 14న ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నట్లు సమాచారం.

Continue Reading