పాపం కదా!జీతాలు తక్కువ వస్తుంటాయి అని మీరు ఇచ్చే 20/30 రూ. గ్సాస్ ఏజెన్సీ కి లక్షల్లో బ్లాక్ మనీ

అమరావతి ఆంధ్రప్రదేశ్ కర్నూల్ విజయవాడ

మీరు గ్యాస్ డెలివరి బాయ్ కి 20/30 రూ. ఇస్తున్నారా?⛽

గ్యాస్ డెలివరి కి మీరు ఇచ్చే అమౌంట్=662.50

ఇందులో 630.95 గ్యాస్ బిల్ + 31.55 డెలివరి చార్జెస్=662.50

అంటే మనం మన ఇంటికి డెలివరి చేసేందుకు కూడా బిల్ పే చేస్తున్నాం.

మీరు 20/30 రూ.డెలివరి బాయ్స్ కి ఇవ్వడం ద్వారా గ్యాస్ ఏజెన్సీలే లక్షల్లో బ్లాక్ మనీ దండుకుంటున్నాయి. ఎలా?

మీరు ఎలాగు 20/30 రూ. ఇస్తున్నారు కాబట్టి ఆటో ఖర్చు,డీజిల్ ఖర్చు,డెలివరి బాయ్స్ జీతం ఖర్చులు గ్యాస్ ఏజెన్సీకి అందులోనే సరిపోతుంది.ఎలా?

ఒక రోజుకు 500 సిలిండర్లు సేల్ జరిగితే 500*20=10000

నెలకు 10000*30=3,00,000.

ఈ 3 లక్షల్లో డెలివరి బాయ్స్ ఆటో,డీజిల్ ఖర్చులు పోగా మిగిలింది డెలివరి బాయ్స్,ఏజెన్సీ వాటా పంచుకుంటారు

ఇప్పుడు అసలు విషయానికి వస్తే గ్యాస్ బిల్ లో 31.55 రూ

మనం ఇచ్చే డెలివరి చార్జెస్ ని ఏజెన్సీ తింటోందది.ఎందుకంటే మనం ఇచ్చే 20/30 రూ. డెలివరి ఖర్చులకు సరిపోతుంది.

ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ ఎంత దండుకుంటుందో చూద్దాం.

31.55 కాకుండా 30 కే కుదించుదాం.

ఒక రోజుకు 500 సిలిండర్లు సేల్ అవుతే
500*30=15000

నెలకు 15000*30=4,50,000

సంవత్సరానికి 4,50,000*12=54,00,000/-

ఒక డెలివరి బాయ్ కి చిల్లరే కదా అని మీరు ఇచ్చే 20 రూ మీ గ్యాస్ ఏజెన్సీకి పరోక్షంగా 50 లక్షలకు పైగా బ్లాక్ మనీ కి సహకరిస్తున్నాం.

రూల్స్ ప్రకారం గ్యాస్ డెలివరి బాయ్ కి 1 రూ. కూడా ఇవ్వకండి.

సమాచార హక్కు చట్టం ద్వారా నాకు తెలిసిన విషయాలు:-

1)గ్యాస్ ఏజెన్సీ కి 5 కి.మి.ల రేడియస్ లోపు ఎక్కడ డెలివరి జరిగిన డెలివరి బాయ్ కి ఎటువంటి చార్జెస్ చెల్లించరాదు.అ పై ప్రతి 1.6 కి.మి. లకు చార్జెస్ పే చేయాలి.

2) డెలివరి టాప్ ఫ్లోర్ లొ చేసినా చార్జెస్ వసూలు చేయరాదు.

3)ఒకవేల మనమే ఏజెన్సీకి వెళ్ళి గ్యాస్ తీసుకుంటే ఏజెన్సీవారు బిల్లు లో డెలివరి చార్జెస్ లో 20 రూ.మనకు రిబేట్ ఇవ్వాలి

పాపం కదా!జీతాలు తక్కువ వస్తుంటాయి అని మీరు ఇచ్చే 20/30 రూ. గ్సాస్ ఏజెన్సీ కి లక్షల్లో బ్లాక్ మనీ తెచ్చి పెడుతున్నాయి.అదే మీరు డెలివరి బాయ్ కి 20/30 పై ఖర్చులు ఇవ్వకపోతే అప్పుడు గ్యాస్ ఏజెన్సీలు 31.55 రూ.(ఏదైతే మనం కట్టే గ్యాస్ బిల్లు లో ఇంక్లూడ్ అయి ఉందో) వాటిని డెలివరి బాయ్స్ జీతాలు, ఆటో,డీజిల్ ఖర్చులుకు వాడక తప్పదు.అప్పుడు గ్యాస్ ఏజెన్సీ ల అక్రమ సంపాదన అరికట్టినట్లవుతుంది.

కావున ఇప్పటినుండి బిల్ లో ఉన్న అమౌంట్ కి రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దు.ఒకవేళ 20/30 రూ. అడిగితే రసీదు దానికి రసీదు అడగండి.అతను రసీదు ఇవ్వలేడు.

పెట్రోల్ బంకుల దగ్గర 99.51రూ పోయించుకొని మిగులు 49 పైసలు దేశం మోత్తానికి లెక్కేస్తేనే కోట్లల్లోఉంటుంది. అలాంటిది మీరు ఇచ్చే 20/30 రూ. దేశం మొత్తానికి లెక్కెస్తే ఎన్ని కోట్లవుతుందనేది

మీ లెక్కకే వదిలేస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *