పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు మేళాను ఈ నెల 7వ తేదీన

అమరావతి ఆంధ్రప్రదేశ్

పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు మేళాను ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నారు.

దీనికి సంబంధించిన స్లాట్‌ బుకింగ్‌, అవసరమైన పత్రాలు తదితర వివరాలను విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారి శ్రీనివాస్‌ వివరించారు.

పాస్‌పోర్టు కావాలనుకునేవారు ముందుగా ఎంపాస్‌పోర్ట్‌ యాప్‌లో కానీ, వెబ్‌సైట్‌లో కానీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

దీని కోసం 7వ తేదీ శనివారం స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా పాత్రికేయుల కోసమే అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఎంపాస్‌పోర్ట్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకో వాలనుకునే వారు ముందుగా రిజిస్టర్‌ చేసు కోవాలి.

ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారా.. పాతదా? సాధారణమా? తత్కాల్‌లోనా? అని అడుగు తుంది. సాధారణమని నమోదు చేసుకోవాలి.

ఇలా మొత్తం 9 పేజీల సమాచారం నింపాల్సి ఉంటుంది.

వీటిలో ఈసీఆర్‌, నాన్‌ ఈసీఆర్‌ అనే రెండు కేటగిరీలు ఉన్నాయి.

పదో తరగతి, ఆపై చదివినట్లు ఆధారం ఉంటే నాన్‌ ఈసీఆర్‌ కిందికి వస్తాం.

దీనికి 10వ తరగతి సర్టిఫికెట్‌ కానీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్‌ కానీ ఒరిజినల్‌ తప్పనిసరిగా ఉం డాలి.

ఈ డాక్యుమెంట్లను శనివారం పాస్‌ పోర్టు కార్యాలయానికి తెచ్చుకోవాలి.

పూర్తి చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసు కోవాలి. ప్రత్యేకించి పేరు, ఊరి పేరు, చిరునా మా నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉం డాలి.

అన్నీ పూర్తి చేసిన తర్వాత ఫీజు పోర్టల్‌ ఓపెన్‌ అవుతుంది. ఒక్కొక్కరికి రూ.1500 చెల్లించాలి.

డాక్యుమెంట్లు ఒరిజినల్స్‌, జిరాక్స్‌లు తీసుకుని శనివారం పాస్‌పోర్డు కా ర్యాలయానికి రావాల్సి ఉంటుంది.

స్లాట్‌ బుకింగ్‌లో అనుమానాలు ఉంటే గురువారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఎంబీవీవీకేలో అమరావతి ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధి, పాస్‌పోర్టు సేవాకేంద్రం సిబ్బంది అందుబా టులో ఉంటారు.

గతంలో పాస్‌పోర్టు దరఖా స్తు చేసుకుని తిరస్కరణకు గురై ఉంటే దర ఖాస్తు సమయంలో ఆ విషయాన్ని నిర్దేశిం చిన కాలమ్‌లో తప్పకుండా తెలియజేయాలి. సర్వే వేగవంతం చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *