ఇస్రో ఖాతాలో మరో విజయం.. PSLV-C 48 ప్రయోగం సక్సెస్

ఆంధ్రప్రదేశ్ జాతీయం నెల్లూరు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)చరిత్ర సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. 5సంవత్సరాల పాటు పీఎస్ఎల్పీ సీ48 సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. శాస్త్రవేత్తల బృందానికి శివన్ అభినందనలు తెలిపారు.

310 విదేశీ ఉపగ్రహాల్ని నింగిలోకి చేర్చిన ఇస్రో ఈ ప్రయోగం విజయవంతంతో ఆ సంఖ్య 319కి చేరింది. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. ఇస్రో ప్రయోగాల్లో పీఎస్ ఎల్పీ రాకెట్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఇది ఒకటి. ఇప్పటివరకూ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి 49పీఎస్ఎల్వీ మెషీన్లు లాంచ్ అయిన విషయం తెలిసిందే. 49 ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలమయ్యాయి.

ఇవాళ(డిసెంబర్-11,2019) పీఎస్ఎల్పీ 50వ మిషన్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ వాహకనౌక ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 11 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. భారత్‌కు చెందిన ఆర్‌ఐఎస్‌ఎటి-2బి ఆర్‌ఐ1 ఉపగ్రహంతోపాటు మరో తొమ్మిది విదేశీ నానో ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. నానో ఉపగ్రహాల్లో ఇజ్రాయిల్‌, ఇటలీ, జపాన్‌కు సంబంధించి ఒక్కటి చొప్పున, ఎఎస్‌ఎకు చెందిన ఆరు ఉన్నాయి.

భూ వాతావరణం,విపత్తులతో పాటుగా రక్షణరంగానికి కూడా రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహం ఉపయోగపడనుంది. 35 సెంటీమీటర్ల దూరంలోని వస్తువులను కూడా రీశాట్-2 బీఆర్1 సృష్టంగా చూపించగలదు.వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని ఒకటో లాంఛ్ ప్యాడ్ నుంచి ప్రయోగించింది. ఇప్పటికే పీఎస్ ఎల్వీ సీ 47 ప్రయోగం సక్సెస్ కావడంతో మంచి ఊపుమీదున్న ఇస్రో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రయోగం చేపట్టారు. శ్రీహరికోట సతీష్​దావన్​స్పేస్ సెంటర్​నుంచి పీఎస్ఎల్వీ-సీ48 నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరింది.

పీఎస్ఎల్వీ-సీ48 సక్సెస్ కావడంపై ఇస్రో ఛైర్మన్ శివన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో తురుపుముక్క పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగాల్లో ఇది 50వది. ఇప్పటిదాకా 49 పీఎస్ఎల్వీలను అంతరిక్షంలోకి పంపించింది. 23 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ అనంతరం నింగిలోకి దూసుకెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *