విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో అంతర్గత నాణ్యత హామీ విభాగం ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించటం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు విద్య

పత్రిక ప్రకటన
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం: నెల్లూరు
తేదీ: 25.11. 2019

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో అంతర్గత నాణ్యత హామీ విభాగం ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్నిప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మాజీ అంతర్గత నాణ్యత హామీ విభాగం సమన్వయ కర్త ఆచార్య డి. చంద్ర శేఖర్ రెడ్డి గారు రిసోర్సు పర్సన్ గా వ్యవహరించారు. ఈ సందర్భముగా ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శన రావు మాట్లాడుతో ఈ విద్యా సంవత్సరం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ఇచ్చు 12 బి గుర్తింపునకు సంబంధించి ఒక ప్రత్యక కమిటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిందని త్వరలోనే 12బి గుర్తింపు మన విశ్వవిద్యాలయానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేణువంటనే NAAC (National Assessment of Accreditation counsel/ జాతీయ నాణ్యత ప్రమాణ సంస్థ ) గుర్తింపు కోసం ఇప్పటి నుంచే కావలసిన అన్ని రకాల విధివిధానాలు సిద్ధం చేసుకోవాలని, అందుకోసమే ఈ వర్క్ షాప్ చేయటం జరిగిందని తెలిపారు. ఈ వర్క్ షాప్ ద్వారా అధ్యా పకులందరు అన్ని ఫార్మాట్ ల మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయ అంతర్గత నాణ్యత హామీ విభాగం సమన్వయ కర్త డా. కిరణ్మయి పనితీరును ప్రశంసించారు. తదనంతరం డి. చంద్ర శేఖర్ రెడ్డి గారు NAAC లో గల ఏడు కీలక అంశాల మీద విపులంగా వివరించటం జరిగింది. ప్రతి అంశం లో గల ఉద్దేశ్యము మరియు ఆవశ్యకత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కాళశాల ప్రిన్సిపాల్ ఆచార్య జవహర్ బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అందే ప్రసాద్ డీన్ ఆచార్య విజయ్ ఆనంద్ కుమార్ బాబు మరియు విద్యాలయ అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *