AMATEUR SILAMBAM “(కర్ర సాము)” ASSOCIATION OF ANDHRA PRADESH అధ్యక్షునిగా ఎన్నికైన పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి గారు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

AMATEUR SILAMBAM “(కర్ర సాము)” ASSOCIATION OF ANDHRA PRADESH అధ్యక్షునిగా ఎన్నికైన పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి గారు

నెల్లూరు నగరంలోని డి.ఎస్.ఆర్ గెస్ట్ ఇన్ నందు AMATEUR SILAMBAM “(కర్ర సాము)” ASSOCIATION OF ANDHRA PRADESH వారు సర్వసభ సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 13 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులతో కలిసి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న 13 జిల్లాల అధ్యక్షులకు, కార్యదర్శులకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా సిలభం అనేది తమిళ భాష నుంచి వాడుకగా వచ్చిందని మన రాష్ట్రంలో కర్రసాము అని అంటారని, ఈ క్రీడను వివిధరాష్ట్రాలలో వివిధరకాలుగా పిలవడం జరుగుతుందని, దేశవ్యాప్తంగా ఈ క్రీడకు సిలభం అని నామకరణం చేయడం జరిగిందని తెలియజేశారు.
ఈ క్రీడను అన్ని క్రీడలతో సమానంగా రాష్ట్రంలో గుర్తింపు తెచ్చే విధంగా, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ క్రీడ అభివృద్ధికి తోడ్పడుతామని తెలియజేశారు. ఈ క్రీడను అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగాలలో మెరిట్ ప్రాతిపదికన స్పోర్ట్స్ కోటాలో వారికి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ క్రీడకు సంబంధించి డిసెంబర్ 28,29 తేదీలలో రాష్ట్రస్థాయిలో నెల్లూరు జిల్లాలో నిర్వహించేందుకు అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ క్రీడ మనదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు అయినటువంటి సింగపూర్,ఇండోనేషియా, మలేషియాలోని ప్రవాసాంధ్రులు ఈ క్రీడను అభ్యశిస్తున్నారని, కాబట్టి మన దేశంలో మన రాష్ట్రంలో మంచి ప్రోత్సాహం అందించి ముందుకు తీసుకువెళ్లి పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా దీని నేర్పించేవిధంగా కోచ్ లు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలోనే కాకుండా, మండల స్థాయిలో, గ్రామస్థాయిలో ఈ క్రీడను ప్రోత్సహించే విధంగా మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, రాబోవు ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ క్రీడను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు సంబంధించి, మండలస్థాయిలో ముందుకు తీసుకు వెళ్ళే విధంగా ఈరోజు ముఖ్యంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *