విజయవాడలో కారు బీభత్సం

అమరావతి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

విజయవాడ: నగరంలో XUV500 నెంబరు గల కారు సోమవారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించింది. సీతారాంపురం లాల్ బహుదూర్ శాస్త్రి వీధిలో అతివేగంగా వచ్చిన కారు ఓ షాపులోకి దూసుకుపోయింది. గూడ్స్ ఆటోలు, బైకులు ధ్వంసమయ్యాయి. ఉదయం కావడం.. జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *