కూలిన ఆనకట్ట తూములు- తప్పిన ప్రమాదం

అమరావతి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

కూలిన ఆనకట్ట తూములు- తప్పిన ప్రమాదం. నెల్లూరు ప్రకంపన ప్రతినిధి. స్థానిక రంగనాయకుల పేట ప్రాంతంలో ఉన్న మందిరం పక్కన, పురాతన నిర్మాణమైన ఆనకట్ట తూములు శుక్రవారం పాడైపోయి, పడిపోయినవి. ఆ దారి రంగనాయకులపేట నుండి కొవ్వూరు వెళ్ళుటకు చాలా ఉపయోగకరంగా ఉండేది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో పాటు, పై తట్టు నుండి వరద ప్రవాహం ఎక్కువగా వస్తుండడంతో ఆ దారిన వాహనదారులు రాకపోకలు నిలిపి వేయడం జరిగింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆనకట్ట తూములు ఓడిపోయినప్పటికీ, మా దారిన రాకపోకలు నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది అని స్థానికులు చెబుతున్నారు. నూతనంగా నిర్మితమైన బ్రిడ్జి వాడుకలోకి రాకపోవడంతో ప్రజలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా ఆనకట్ట పడిపోయిన అప్పటికీ ప్రమాద బారిన పడకుండా సింహపురి ప్రజలను శ్రీ రంగనాయక స్వామి వారే కాపాడినట్లు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *