రానా షాకింగ్ లుక్‌….

అమరావతి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

యంగ్ హీరో రానా ప్రస్తుతం అమెరికాలో కిడ్నీ సంబంధిత చికిత్స తీసుకుంటున్నాడు. దగ్గుబాటి కుటుంబం అధికారికంగా ఈ విషయమై ప్రకటన చేయకపోయినప్పటికీ.. రానా అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాడని కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రానా అందుబాటులో లేని కారణంగానే కొన్ని సినిమాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.

రానా తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్ నిమిత్తం తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. ఈ ఫోటో అతని అభిమానులకు షాక్ కలిగించింది. మంచి బాడీతో దృఢంగా ఉండే రానా ఇలా సన్నగా అయిపోవడంతో అభిమానులు షాకయ్యారు. చికిత్సలో భాగంగానే రానా ఇలా సన్నబడ్డాడని తెలుస్తోంది. త్వరలోనే చికిత్స పూర్తి చేసుకుని భారత్‌కు వచ్చి షూటింగ్‌లలో పాల్గొనడానికి రానా సిద్ధమవుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *