ప్రభుత్వ అసమర్థత వలనే విత్తనాలు కొరత – చేజర్ల

అమరావతి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

[1:30 pm, 28/10/2019] +91 93948 26689: రైతులకు అవసరమైన వరి విత్తనాలను వెంటనే సరఫరా చేయాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో భాగంగా కోవూరు వ్యవసాయ శాఖ ఏ డి శ్రీ కుప్పయ్య గారికి వినతిపత్రం ఇస్తున్న జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మరియు తెలుగురైతు నాయకులు.
[1:30 pm, 28/10/2019] +91 93948 26689: ప్రభుత్వ అసమర్థత వలనే విత్తనాలు కొరత – చేజర్ల
ప్రభుత్వ అసమర్థత వలనే జిల్లాలో వరి విత్తనాల కొరత ఏర్పడిందని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.రైతులకు అవసరమైన వరి విత్తనాలను ,సూక్ష్మ పోషకాలను వెంటనే పంపిణీ చేయాలని కోరుతూ శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందన కార్యక్రమంలో భాగంగా కోవూరు వ్యవసాయ శాఖ ఏ డి శ్రీ కుప్పయ్య గారికి వినతిపత్రం సమర్పించడము జరిగినది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ 2014 కు ముందు రాష్ట్రంలో రైతులు నిత్యం విత్తనాల కోరుకో, ఎరువుల కోరుకో, కరంటు కోరుకో రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఉండేవని,అయితే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు లేకుండా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేయడము వలన ఏ ఒక్క రైతు కూడా ఎరువులు కోరుకో ,విత్తనాల కోరుకో ఎదురు చూడవలిసిన పరిస్థితి రాలేదని, మరలా రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు విత్తనాల కోసం నిత్యం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని,2015 వ సంవత్సరం లో జిల్లాలో భారీ వర్షాలు కురిసి జలాశయాలు అన్ని నిండి దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరి పండించినప్పటికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు వలన ఎక్కడా కూడా విత్తనాల కొరత ఏర్పడలేదని,నేడు 6 లక్షల ఎకరాలకు వరి సాగుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ప్రభుత్వ అసమర్థత వలన విత్తనాల కొరత ఏర్పడి రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగవలసి వస్తుంది, అదేవిధంగా గతములో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షలు నిర్వహించి ఆ భూమిలో ఉన్న లోపాలు నివరించుట కొరకు సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, జిప్శం ఉచితంగా పంపిణీ చేసారని, నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం ఇంతవరకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని కావున ప్రభుత్వం వెంటనే రైతులకు అవసరమైన విత్తనాలను ,సూక్ష్మ పోషకాల ను అందుబాటులోకి తెచ్చి రైతులకు పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా ఏ డి శ్రీ కుప్పయ్య గారు వీలైనంత త్వరగా రైతులకు విత్తనాలు, సూక్ష్మ పోషకాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకులు శ్రీ కలికి సత్యనారాయణ రెడ్డి,శ్రీ కావాలి ఓంకార్, శ్రీ చింతా సుబ్బారెడ్డి, శ్రీ పునూరు శ్రీనివాసులు రెడ్డి మరియు పార్టీ నాయకులు శ్రీ జొన్నదుల రవికుమార్,శ్రీ శివుని రమణారెడ్డి,శ్రీ పాలూరు వెంకటేశ్వర్లు,శ్రీ సోమవరపు సుబ్బారెడ్డి, శ్రీ గరికిపాటి అనిల్,శ్రీగొర్రెపాటి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *