మార్కెటింగ్, సహకార శాఖలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..మార్కెట్‌ ఛైర్మన్లలో సగం మహిళలకే

అమరావతి ఆంధ్రప్రదేశ్

అమరావతి

· మార్కెట్‌ ఛైర్మన్లలో సగం మహిళలకే
· కమిటీల్లో కూడా సగం మహిళలకే, అక్టోబరు చివరినాటికి భర్తీ
· ఇప్పటికే జారీ అయిన జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభైశాతం రిజర్వేషన్లు, ముఖ్యమంత్రి ఆదేశం
· పంటలు వేసినప్పుడే వాటికి ధరలు ప్రకటించాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం
· ఆరునెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలి
· కనీస మద్దతు ధరలు లేని పంటలకూ ధరలు ప్రకటించాలి
· అక్టోబరు చివరి నాటికి చిరుధాన్యాలపై బోర్డు
· వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకోసం ఇప్పుడున్న గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేలపై సమగ్ర పరిశీలన, అవసరాలమేరకు కార్యాచరణ ప్రణాళిక
· జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలపై ఒక కమిటీ
· వీటి పునర్‌ వ్యవస్థీకరణ, బలోపేతంపై ప్రతిష్టాత్మక సంస్థతో అధ్యయనం
· 6 నెలల్లోగా సిఫార్సులు,అమలు ప్రారంభం
· అవినీతి, పక్షపాతం సహకార రంగంలో ఉండరాదు
· మార్కెటింగ్, సహకార శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష

అమరావతి: మార్కెటింగ్, సహకార శాఖలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌
సమీక్ష
దరల స్థిరీకరణ, మార్కెట్లలో కనీస సదుపాయాలు, మిల్లెట్స్‌ బోర్డులపై సమీక్ష
సహకార రంగం పటిష్టతపైనా సీఎం సమీక్ష
సమావేశంలో మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ హాజరు

పంటలకు లభిస్తున్న ధరలు, మార్కెట్లపై నిరంతర సమాచారం

మూడు మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం
ఇప్పుడున్న అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీలు, అగ్రివాచ్‌తో సహా మరో ఏజెన్సీ ఏర్పాటుకు గత సమీక్షలో సీఎం నిర్ణయం, దీనిపై ప్రతిపాదనలు వివరించిన అధికారులు
వ్యవసాయ ఉత్పత్తుల భవిష్యత్‌ ధరలు, బిజినెస్‌ కన్సల్టెన్సీ, ధరల స్థిరీకరణ నిధి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఈ ఏజెన్సీ వి«ధులుగా ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం
నిపుణులను ఇందులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

పప్పు ధాన్యాల కొనుగోళ్ల కోసం కేంద్రాలు

కొనుగోలు కేంద్రాలపై ఆరాతీసిన ముఖ్యమంత్రి
అన్ని ఆరుతడిపంటల వివరాలను ఆన్‌లైన్లో రైతులు నమోదు చేయించుకోవాలన్న అధికారులు
ఆరుతడి పంటలపై అక్టోబరు 10 నుంచి రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న అధికారులు
అక్టోబరు 15 నుంచి కొనుగోలు ప్రారంభిస్తామన్న అధికారులు

ధరల స్థిరీకరణ, మార్కెట్లో ప్రభుత్వ జోక్యం

85 రైతు బజార్లలో రూ.25 లకే కిలో ఉల్లిపాయలు విక్రయించామన్న అధికారులు
660 మెట్రిక్‌ టన్నులు వినియోగదారులకు ఇచ్చామన్న అధికారులు
రూ. 32 లకే కిలో ఉల్లి ధరను అదుపు చేయగలిగామన్న అధికారులు
మళ్లీ ధరలు పెరిగిన క్రమంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న అధికారులు
రాష్ట్రంలో ఇప్పుడు సరిపడా నిల్వలు ఉన్నాయా? లేదా? అని అధికారులను ఆరా తీసిన సీఎం
సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పిన అధికారులు
టమోటా రైతులను కూడా ఆదుకున్నామన్న అధికారులు
కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మార్కెటింగ్‌ అవకాశాలు చూసి ఆమేరకు చర్యలు తీసుకున్నామన్న అధికారులు

చిరు ధాన్యాల హబ్‌ గా రాయలసీమ

రాయలసీమ ప్రాంతాన్ని మిల్లెట్స్‌ హబ్‌గా మార్చాలన్న సీఎం
9 నెలలపాటు గ్రీన్‌ కవర్‌ఉండేలా చూడాలన్న సీఎం
మిల్లెట్స్‌ బోర్డులో కూడా నిపుణులకు పెద్దపీట వేయాలన్న సీఎం
వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్, ప్రాససింగ్‌ అన్నీ బోర్డు పరిధిలో ఉంచాలన్న సీఎం
మిల్సెట్స్‌ బోర్డు విధివిధానాలపై సమావేశంలో చర్చ, అక్టోబరు చివరినాటికి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం

పంటలు వేసేముందే.. ధరలప్రకటన

కందులు, మినుములు, పెసలు, శెనగలు, టమోటా, పత్తి పంటలకు భవిష్యత్తు ధరలు ఎలా ఉంటాయన్నదానిపై సమావేశంలో చర్చ
ధరల విషయంలో ప్రభుత్వం జోక్యంచేసుకున్న తర్వాత పరిస్థితి కచ్చితంగా మారాలన్న సీఎం
రైతులకు కచ్చితంగా భరోసా ఇచ్చామన్న నమ్మకం కలగాలన్న సీఎం
క్షేత్రస్థాయి వరకూ అది జరగాలన్న సీఎం
పంట వేసినప్పుడు వాటికి ధరలు ప్రకటించే పరిస్థితి ఉండాలన్న సీఎం
ఆ ధర ఏమాత్రం తగ్గుతున్నా.. ఆదుకోవడానికి తగిన ప్రణాళికలతో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నీ సీఎం
దళారీలకు పంటలను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండకూడదన్న సీఎం
దళారులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయాలు జరగాలి
అరటి, చీనీ, మామిడి, కమలాపండ్ల, బొప్పాయి సహా ఏ పంట విషయంలోనైనా దళారులు లేకుండా చూడండి
6 నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలి, అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలి
మార్కెటింగ్‌లో మనం అనుసరించే విధానాలు రైతుల ప్రయోజనమే లక్ష్యం కావాలి
గ్రామ సచివాలయాల్లోనే ఈ క్రాప్‌ వివరాలు, ధరలు ప్రకటించాలన్న సీఎం
రైతులకు నేరుగా కాల్‌చేసి సహాయం అడిగే అవకాశం ఉండాలన్న సీఎం
దీనివల్ల ప్రైవేటు వ్యక్తులుకూడా మంచి ధరలకు రైతులనుంచి కొనుగోలుచేస్తారన్న సీఎం
ఇ–క్రాప్‌ నమోదుపై వాలంటీర్ల ద్వారా రైతులకు సమాచారం ఇవ్వాలన్న సీఎం
గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే బోర్డులు ఉంచాలన్న సీఎం
కనీస మద్దతు ధరలు లేని పంటలకూ ధరలు ప్రకటించాలన్న సీఎం
రైతుకు నష్టం రాకుండా ఉండేలా ఈధరలు నిర్ణయించాలన్న సీఎం
పంటల దిగుబడులు కూడా ఏస్థాయిలో ఉంటాయన్నదానిపై అంచనాలు రూపొందించాలన్న సీఎం
గత ఏడాదితో పోల్చి ఈ వివరాలు తయారుచేయాలన్న సీఎం

గోడౌన్లు, కోల్డ్‌ స్టోరీజేలపై చర్చ

వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకోసం ఇప్పుడున్న గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేలపై సమగ్ర పరిశీలన జరగాలన్న సీఎం
ప్రస్తుతం ఉన్న అవసరాలు, వాటిని తీర్చేలా గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలన్న సీఎం
చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల కోసం కూడా ఎన్నికోల్డ్‌స్టోరేజీలు ఉండాలన్నదానిపై కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం
ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆలోచనలు చేయాలన్న సీఎం

మార్కెట్‌ ఛైర్మన్లలో సగం పదవులు మహిళలకే

మార్కెట్‌ ఛైర్మన్లలో సగం మహిళలకే ఇవ్వాలని సీఎం ఆదేశం
కమిటీల్లో కూడా సగం మహిళలకే ఇవ్వాలని ఇదివరకే జీవో ఇచ్చామన్న సీఎం
అక్టోబరు చివరినాటికి భర్తీకి చర్యలు తీసుకోవాలన్న సీఎం

సహకార బ్యాంకులు, సహకార రంగం పటిష్టానికి చర్యలు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలపై ఒక కమిటీ వేయాలన్న సీఎం
వాటిని తిరిగి బలోపేతం చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
ప్రస్తుతం ఉన్న సమస్యలు, దీన్ని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక తయారుచేయాలన్న సీఎం
అవినీతి, పక్షపాతానికి తావులేని విధానం ఉండాలన్న సీఎం
సహకారరంగాన్ని పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించాలన్న సీఎం
ఈ వ్యవస్థని బాగుచేయడానికి ఏంచేయాలో అదిచేద్దామన్న సీఎం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించే దిశగా చర్యలు తీసుకుంటామన్న సీఎం
ప్రతిష్టాత్మక సంస్థతో సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయించాలన్న సీఎం
ఆప్కో పునరుద్ధరణ, బలోపేతంపైనకూడా అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశం
నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ ప్రక్రియ పూర్తికావాలన్న సీఎం
6 నెలల్లో మొత్తం అధ్యయనం, సిఫార్సుల అమలు మొదలు కావాలన్న సీఎం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *