వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారితో చర్చించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి_రంగయ్య గారు

అమరావతి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివ్యరులు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారిని అమరావతి లోని CM క్యాంపు కార్యాలయంలో కలిసి జిల్లాలోని పలు సమస్యల పై
ముఖ్యమంత్రి గారితో చర్చించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి_రంగయ్య గారు అనంతపురం జిల్లాకు నీటి వసతి కల్పించడం కోరుకు కర్ణాటక ప్రభుత్వం తో
చర్చలు జరపాలని అనంతపురం జిల్లా లో తాగు నీరు సాగు నీటి సౌకర్యాల కోసం చర్యలు చేపట్టాలని..

వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి వివరించిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారు
వీటిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి అధికారులతో చర్చలు జరపాలని ఆదేశించారు..అలాగే
అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని కులాలకు సంబంధించిన స్మశానవాటికల భూముల కోసం నిధులు కేటాయింపు పై మరియు
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరగా వాటిపై కూడా సానుకూలంగా స్పందించారు
మరియు లెప్రసి వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరగా వీటికి సానుకూలంగా స్పందించారు.

HLC ,తుంగభద్ర, హంద్రీనీవా, కాలువల సామర్థ్యం పెంచి జిల్లాకు ఎక్కవ నీటిని వసతి ఏర్పాటు చేయాలని కోరగా వాటికి సానుకూలంగా స్పందించారు
జీడిపల్లి రిజర్వాయర్, చాగల్లు రిజర్వాయర్, క్రింద ఉన్న జీడిపల్లి, ఉలికల్లు ఉలికంటి పల్లి గ్రామాల పునరావాసం పైన పూర్తిగా నిధులు కేటాయించి పూర్తి వాటిని
పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *