పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్: ప్ర‌భుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యంలో తొలి అడుగు

అమరావతి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చెప్పుకుంటున్న రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యంలో తొలి అడుగు ప‌డింది. పోల‌వ‌రం ప్రాజెక్ట్ నుంచి దానిని ప్రారంభించారు.

ఈ విధానం ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ ప్ర‌యోజ‌నం చేకూరుతుందని ప్ర‌భుత్వం చెబుతోంది. విప‌క్షం మాత్రం ఈ వాద‌న‌ను తోసిపుచ్చుతోంది. పైగా టెండ‌రింగ్ విధానం లోప‌భూయిష్టంగా ఉంద‌నే ఆరోప‌ణ‌లు చేస్తోంది.

వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పోల‌వ‌రం స‌హా అనేక కీల‌క ప్రాజెక్టుల ప‌నుల‌న్నీ నిలిపివేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని, వాటిపై విచార‌ణ చేసిన త‌ర్వాత మాత్ర‌మే ప‌నులు తిరిగి ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

అందుకు అనుగుణంగానే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల ప‌రిశీల‌న‌కు ఓ క‌మిటీని నియ‌మించారు. ఆ క‌మిటీ నివేదిక ప్ర‌కారం రూ. 2,500 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దానిని స‌రిచేయ‌డం కోసం తొలిసారిగా రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానాన్ని ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌ట్ట‌లేదు. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిచే కొన్ని సంస్థ‌ల్లో మాత్ర‌మే ఈ ప్ర‌క్రియ చేప‌ట్టారు. అయితే, వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల్లో భాగంగా ఈ విధానం ఏపీలో అమ‌లులోకి వ‌చ్చింది. తొలుత పోల‌వ‌రం ప్రాజెక్ట్ నుంచి మొద‌లుపెట్టారు.

పోలవరం ప్రాజెక్టు హెడ్ వ‌ర్క్స్ నుంచి ఎడ‌మ కాలువ‌కు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ ప‌నుల‌కు రివ‌ర్స్ టెండ‌రింగ్ ప‌ద్ధ‌తి నిర్వ‌హించారు. దాని ద్వారా రూ. 58 కోట్ల రూపాయాలు ఆదా చేసిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. ఆరు సంస్థ‌లు టెండ‌ర్లు దాఖ‌లు చేయ‌గా, అందులో ఎల్ 1 సంస్థ రూ.260.26 కోట్ల‌కు టెండ‌ర్ దాఖ‌లు చేసింది. రూ.274 కోట్ల విలువ చేసే ప‌నుల‌ను 6.1 శాతం త‌క్కువ‌కు పూర్తి చేయ‌డానికి అంగీక‌రించిన ఎల్ 1 క‌న్నా ఎవ‌రైనా త‌క్కువ‌కు చేస్తారా అంటూ రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హించారు. దాంతో రూ.231.47 కోట్ల‌తో పూర్తి చేసేందుకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఇది అంచ‌నా విలువ క‌న్నా 15.66 శాతం త‌క్కువ.
రివ‌ర్స్ టెండ‌రింగ్ కాదు.. రిజ‌ర్వుడు టెండ‌రింగ్’
ప్ర‌భుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరుతో త‌మ‌కు కావాల్సిన వారికి ప‌నులు అప్ప‌గించేందుకు ‘రిజ‌ర్వ్‌డ్ టెండ‌రింగ్’ అమ‌లు చేసింద‌ని టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆరోపించారు.

“నిబంధ‌న‌లు మార్చేశారు. సాంకేతిక అర్హ‌త‌లు ప‌రిశీలించిన త‌ర్వాత టెండ‌ర్లు ఆహ్వానించాలి. కానీ, దానికి విరుద్ధంగా చేశారు. టెక్నిక‌ల్ బిడ్లు తెర‌వ‌కుండా ఫైనాన్సియ‌ల్ బిడ్లు తెర‌వ‌డం అనేది గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కూడా జ‌ర‌గ‌లేదు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్ని, సాంకేతిక నిపుణుల‌ను కూడా సంప్ర‌దించ‌కుండా ఏక‌ప‌క్షంగా ఈ ప్ర‌క్రియ సాగిస్తున్నారు. కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్ నివేదిక‌ల‌ను తుంగ‌లో తొక్కారు. ఆ ప్రాజెక్టుకు ఏమైనా అయితే గోదావ‌రి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగ‌ల‌దు. అయినా, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇవేమీ ప‌ట్ట‌డం లేదు” అని చంద్రబాబు అన్నారు.
గ‌తంలో నిర్వ‌హించి ప్రారంభిస్తున్న‌ట్టు తెలిపింది.హెడ్ వ‌ర్క్స్, ప‌వ‌ర్ స్టేష‌న్ ఒకే టెండ‌ర్‌

తాజాగా కీల‌క‌మైన హెడ్ వ‌ర్క్స్, ప‌వ‌ర్ స్టేష‌న్ ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచారు. రూ. 4,987.55 కోట్ల విలువచేసే ప‌నుల‌కు టెండర్లు పిలువగా.. 12.6 శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు ‘మేఘా’ సంస్థ ముందుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది.

ఈ పనుల కోసం రూ. 4,358.11 కోట్లు కోట్‌ చేస్తూ.. మేఘా సంస్థ బిడ్డింగ్‌ వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 628.43 కోట్లు ఆదా అవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు, గతంలో 4.8 శాతం అధిక ధరకు కాంట్రాక్టు ఇవ్వ‌డం వ‌ల్ల‌ ప్రభుత్వానికి రూ. 154 కోట్ల అదనపు భారం పడిందని, ఇప్పుడు ఆ భారం కూడా తగ్గడంతో ప్ర‌భుత్వానికి మొత్తం రూ. 782 కోట్లు ఆదా అయినట్టు అధికారులు చెప్పారు.

పోల‌వ‌రం ప్రధాన డ్యాం వద్ద మిగిలిన రూ. 1,771.44 కోట్ల పనుల కోసం, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ. 3,216.11 కోట్ల విలువైన పనులకు టెండ‌ర్లు నిర్వ‌హించారు. ఈ రెండు ప‌నుల‌కు క‌లిపి ఒక‌టే బిడ్ దాఖ‌ల‌య్యింది. మేఘా సంస్థ త‌రఫున ఈ బిడ్ దాఖ‌లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *