రొట్టెల పండుగలో ప్రత్యేక ఆకర్షణగా “పారా గ్లైడింగ్”

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు నూతన అనుభూతిని కల్పిస్తూ తొలిసారిగా “పారా గ్లైడింగ్” ఏర్పాటు చేస్తున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి ప్రకటించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి క్రీడా ప్రాంగణ మైదానంలో పారా గ్లైడింగ్ ట్రయల్ రన్ కమిషనర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుశిక్షితులైన పైలట్ సారధ్యంలో పటిష్టమైన రక్షణతో దాదాపు 200 అడుగుల ఎత్తువరకూ విహరించే సామర్థ్యాన్ని గ్లైడర్ కలిగిఉందన్నారు. పండుగ జరిగే ఐదు రోజుల పాటు భక్తులకు వినూత్న అనుభూతి కలిగిస్తూ ప్రత్యేక ఆకర్షణగా పారా గ్లైడింగ్ అంశం నిలుస్తుందని కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేసారు. పండుగకు విచ్చేసే భక్తులు, నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారా గ్లైడింగ్ అనుభూతిని పొందాలని కమిషనర్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *