ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలు. నెల్లూరు . జనసేన పార్టీ వ్యవస్థాపకులు ప్రముఖ సినీ నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తొలుత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జరుపుకు న్నారు. అందు లో భాగంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని పవన్ కళ్యాణ్ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని మరిన్ని జన్మదిన వేడుకలు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు. జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి లు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే తపనతో కోట్లాది రూపాయలు సంపాదించే సినిమా పరిశ్రమలో వదిలి రాజకీయాల్లోకి రావడం అభినందనీయమన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత క యువతలో రాష్ట్ర వ్యాప్తంగా కొంత మార్పు వచ్చిందని తమ అభిప్రాయాలు వెల్లడించారు. వ్యక్తిగతంగా గానీ రాజకీయ గాని జిల్లాలో మెగాస్టార్ సోదరులకు ఎంతో స్థానం ఉందని తెలిపారు . మెగా సోదరులకు రానున్న కాలంలో జిల్లాలో మరింత ఆదరణ పొందే విధంగా మా వంతు ఆదరణ సేవా కార్యక్రమాలు చేయడమే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్త దాతలకు జనసేన పార్టీ సభ్యులకు స్థానికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ , చిరు అభిమానులు ,జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *