ఏసీబీకి చిక్కిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ కర్నూల్

ఏసీబీకి చిక్కిన పోలీసులు
కర్నూలు : ధ్రువీకరణ పత్రం కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఓ ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా కానాలపల్లెకు చెందిన చాకలి పుల్లయ్య కుమారుడు ఏడోతరగతి చదివి మధ్యలో చదువు ఆపేశాడు. ప్రస్తుతం తి ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలు రాయడానికి పోలీసు ధ్రువీకరణ పత్రం అవసరమైంది. దీనికోసం ఆయన గోస్పాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. అక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్‌ రెడ్డి, కానిస్టేబుల్‌ హరినాథ్‌ రూ.30వేలు డిమాండ్‌ చేశారు. దీంతో పుల్లయ్య ఏసీబీకి సమాచారమిచ్చాడు. ఈ మేరకు ఆదివారం ఉదయం 10.45 గంటలకు పోలీసుస్టేషన్‌లో వారికి డబ్బులు ఇస్తుండగా..ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిద్దరినీ సోమవారం కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *