దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

ఘనంగా దళిత క్రైస్తవుల సమైక్య శాంతియుత నిరసన ర్యాలీ. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి . నెల్లూరు.ప్రకంపన ప్రతినిధి. నెల్లూరు క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నగరంలో లో గత క్రైస్తవుల సమైఖ్య శాంతియుత నిరసన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ కాంపౌండ్ నుంచి కనక మహాల్ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ, విఆర్సి సెంటర్ వై ఎం సి ఏ గ్రౌండ్స్ ప్రాంతంలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో స్థానిక క్రైస్తవ సంఘాల కు సంబంధించిన క్రైస్తవ సోదరీ సోదరులు, యువతీ యువకులు, ఆయా ప్రాంతాలకు చెందిన చర్చిల పాస్టర్ లు పాల్గొని దలిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ ,బీసీ కమిషన్ సభ్యులు, నెల్లూరు పీఠాధిపతులు, ఎం డి ప్రకాశం మాట్లాడుతూ 1950 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఎస్సీ హోదా కల్పించే విషయమై సుప్రీంకోర్టులో వైద్యం నడుస్తుంది తప్ప సరైన న్యాయం జరగలేదని తన ఆవేదన వ్యక్తపరిచారు. జస్టిస్ మిశ్రా కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం వన్ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *