BSNL నిరుద్యోగులకు,వ్యాపారస్తులకు సదా అవకాశం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

BSNL సేవలను సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులకు,వ్యాపారస్తులకు సదా అవకాశం. పి.జి.ఎం రవికుమార్ నెల్లూరు ఏ.బి.సి టీవీ ప్రతినిధి. BSNL సేవలను ప్రజలందరూ సద్వినియోగించుకోవలని BSNL పి.జి.ఎం రవికుమార్ తెలిపారు. స్థానిక BSNL కార్యక్రమంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వ సంస్థ ఆయన BSNL సేవలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని దృఢ సంకల్పంతో నూతన వ్యాపార పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంతో విస్తృతంగా విస్తరించనున్న BSNL సేవలను ప్రజలందరికి చేరువ చేసేందుకై, నిరుద్యోగ వ్యాపార యువతను ప్రోత్సాహించుటకై BSNL సంకల్పించిదన్నారు. 50,000/- నుండి 70,000/- రూ వరకు పెట్టుబడి పెట్టగల నిరుద్యోగ వ్యాపార వేతలు BSNL భాగస్వామ్యం కల్పిస్తుందన్నారు. కావలి,ఉదయగిరి,ఇంజమూరు, తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ అవకాశం కల్పించనుందన్నారు. గ్రామ స్థాయిలో కొందరు వినిపిస్తున్న విమర్శలకు అర్ధం లేదన్నారు. BSNL వేర్పాటుచేయు సెల్ టవర్ల నుండి వచ్చు రేడియేషన్ ల వలన మనుషులకు ఇభందికర పరిస్థితులు ఎదురవుతాయని అనుకోవడం తగదన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతిఒక్కరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ నుండి వెలువడే రేడియేషన్ కంటే సెల్ టవర్లు విడుదలచేయు సామర్థ్యం తక్కువగా ఉందన్నారు. ప్రజల సౌకర్యాదమై రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ నమోదు కేంద్రాలను వేర్పాటు చేయడం జరిగింది అన్నారు. 1699 ప్లాన్ తో అన్ లిమిడేడ్ కాల్స్,లోకేల్,STD ఏ నెట్వర్క్ అయిన పనిచేసే విధంగా అవకాశం ఉందన్నారు. 328/-రూ రిచార్జి తో 84 రోజుల కాల వ్యవధిలో ఉచిత అన్ లిమిటెడ్ కాల్స్ సదుపాయం BSNL లో వుందన్నారు. ఈ అవకాశాన్ని సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోవల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *