పాత పథకాలకే పేర్లు మార్చి నవరత్నాల ముసుగు

అమరావతి ఆంధ్రప్రదేశ్

 వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి యనమల విమర్శలు చేశారు. నవరత్నాల పేరుతో నవ కోతలు, నవ రద్దులు చేశారని ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో రద్దు చేసినవి, పథకాలకు పేర్లు మార్చి ప్రజల మనసుకు ముసుగు వేయలేరని, వారి మనసులనుంచి టిడిపిని తొలగించలేరని యనమల అన్నారు. రద్దు చేసిన పాత పథకాలకే నవరత్నాల మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని ఆరోపించారు. రీటెండరింగ్‌ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలుపుతున్నారని చెప్పారు. ఒక్క రోజు కూడా పనులు ఆపకూడదని టిడిపి ఆరాట పడిందని, ప్రభుత్వ వైఖరి చూస్లుంటే కొత్త పరిశ్రమలు రావడం అటుంచి ఉన్నవి పోయే ప్రమాదముందని యనమల విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *