ఏపీలో 10 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ

అమరావతి ఆంధ్రప్రదేశ్

ఏపీలో 10 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి, ఖనిజశాఖలకు సెక్రటరీగా కె.రాంగోపాల్‌, విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి బి.కోటేశ్వరరావు, యువజన సర్వీసులకు సి.నాగరాణి, సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌గా పి.అరుణ్‌బాబు, లాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ సెక్రటరీగా ఎం.విజయసునీత, ఎంప్లాయిమెంట్‌ మరియు ట్రైనింగ్‌ డైరెక్టర్‌గా లావణ్య వేణి, కాపు కార్పొరేషన్‌ ఎండీగా హరీంద్రప్రసాద్‌, రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌గా రావిలాల మహేష్‌కుమార్‌ బదిలీ అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ లాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఎం. హరినారాయణను నియమించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను హరినారాయణకు అప్పగించించింది. 25 లక్షల ఇళ్ల సైట్లు గుర్తించాల్సిన బాధ్యత హరినారాయణకు అప్పగించారు. అలాగే ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కూడా హరినారాయణకు పూర్తి బాధ్యతలు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *