విజయ్‌ అభిమానులకు బర్త్‌డే కానుక

ఆంధ్రప్రదేశ్

తమిళ స్టార్‌ విజయ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన సమయం వచ్చేసింది ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 63వ సినిమా ఫస్ట్‌లుక్‌ టైటిల్‌ విడుదలైంది శనివారం విజయ్‌ 45వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు బిగిల్‌ (ఆంగ్ల అర్థం విజిల్‌) అనే టైటిల్‌ చిత్రానికి ఖరారు చేశారు ఈ ప్రచార చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించారు గ్యాంగ్‌స్టర్‌గా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా దర్శనమిచ్చారు రెండు పాత్రల్లోనూ విజయ్‌ లుక్స్‌ చాలా విభిన్నంగా ఉన్నాయి ఈ ప్రచార చిత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది Bigil అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది
ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక జాకీ ష్రాఫ్‌ ప్రతినాయకుడు ఎ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు ఇందులో విజయ్‌ తండ్రి కుమారుడి పాత్రలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇది విజయ్‌ అట్లీ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *